Sunday, October 26, 2025
ePaper
Homeఆరోగ్యంకేర్ హాస్పిటల్స్‌లో 69 ఏళ్ల రోగికి గుండె శస్త్రచికిత్స విజయవంతం

కేర్ హాస్పిటల్స్‌లో 69 ఏళ్ల రోగికి గుండె శస్త్రచికిత్స విజయవంతం

  • అత్యధిక ప్రమాదం ఉన్న రోగికి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్+బయోప్రోస్తెటిక్ అయార్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ విజయవంతం
  • కేర్ హాస్పిటల్స్ (Care Hospitals)సీనియర్ సర్జరీ, క్రిటికల్ కేర్ బృందాల సమిష్టి కృషితో రోగి కేవలం 10 రోజుల్లో కోలుకుని డిశ్చార్జ్

మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్‌లో(Care Hospitals) వైద్యులు నల్గొండకు చెందిన 69 ఏళ్ల యెల్లయ్యపై అరుదైన, అత్యంత క్లిష్టమైన హృదయ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు*. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర శారీరక ఇబ్బందులు ఉన్న ఈ రోగికి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ తోపాటు హై-రిస్క్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేశారు. కఠిన పరిస్థితుల్లో జరిగిన ఈ ఆపరేషన్‌ విజయవంతమవడంతో రోగి త్వరగా కోలుకుంటున్నారు. ఈ విజయంతో కేర్ హాస్పిటల్స్‌లో(Care Hospitals) ఉన్న అధునాతన గుండె చికిత్సా సదుపాయాలు, నిపుణుల జట్టు కృషి, వైద్య నైపుణ్యం మరోసారి ప్రతిఫలించింది.

యెల్లయ్య 10 రోజులకు పైగా తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో కేర్ హాస్పిటల్స్‌లో(Care Hospitals) చేరారు. పరీక్షల్లో ఆయనకు బైకస్పిడ్ అయార్టిక్ వాల్వ్‌లో తీవ్రమైన స్టెనోసిస్, గుండె బలహీనత (ఇజెక్షన్ ఫ్రాక్షన్ 20%), వాల్వ్‌పై ఇన్ఫెక్షన్ (ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్) ఉన్నట్లు తేలింది. మొదట వైద్యులు యాంటీబయాటిక్స్, ఇనోట్రోప్స్, ఇతర చికిత్సలతో స్థిరపరచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితి క్షీణించి కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపింది. అధిక ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, కార్డియాక్ సర్జరీ బృందం కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్తో పాటు బయోప్రోస్తెటిక్ వాల్వ్‌ ఉపయోగించి అయార్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది.

కుటుంబ సభ్యులకు శస్త్రచికిత్సలో ఉన్న ప్రమాదాలు మరియు ఫలితాలను వివరించిన తర్వాత, ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. శస్త్రచికిత్స సమయంలో మరియు తర్వాత రోగికి హృదయాన్ని బలపరిచే మందులు, వెంటిలేటర్ సహాయం, రక్త మార్పిడి మరియు ప్లేట్‌లెట్స్ ఇవ్వాల్సి వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం ఆయనకు జ్వరం తగ్గింది, కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు క్రమంగా మెరుగైంది. పదవ రోజున ఆయనను ఆరోగ్యంగా, స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జ్ చేశారు.

ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స గురించి మలక్‌పేట కేర్ హాస్పిటల్స్(Care Hospitals) సీనియర్ కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జన్ డాక్టర్ సుధీర్ గండ్రకోట మాట్లాడుతూ, “యాక్టివ్ ఇన్ఫెక్షన్ మరియు బహుళ అవయవాల పనితీరు తగ్గిన రోగికి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ తో పాటు అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మా సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్ బృందాల సమిష్టి కృషిని చూపిస్తుంది. రోగి ఆరోగ్యం మెరుగుపడేందుకు అందరూ అహర్నిశలు శ్రమించారు,” అని తెలిపారు.

మలక్‌పేట కేర్ హాస్పిటల్స్‌(Care Hospitals) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ, “ఈ కేసు కేర్ హాస్పిటల్స్‌లో(Care Hospitals) ఉన్న అధునాతన వైద్య నైపుణ్యం, జట్టుకృషికి మంచి ఉదాహరణ. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా మా వైద్యులు ప్రాణాలను రక్షించేందుకు ఎప్పుడూ అదనపు కృషి చేస్తారు. ప్రపంచ స్థాయి సదుపాయాలు, కరుణతో కూడిన సంరక్షణతో మలక్‌పేట హాస్పిటల్ లో ఇలాంటి అత్యాధునిక హృదయ చికిత్స అందించడం మాకు గర్వకారణం” అని తెలిపారు.

ఈ అధిక ప్రమాదంలో ఉన్న రోగి విజయవంతంగా కోలుకోవడం, రోగి పట్ల కేర్ హాస్పిటల్స్(Care Hospitals) చూపించే శ్రద్ధ, ఆధునిక వైద్య సాంకేతికత, మరియు బహుళ విభాగాల వైద్య బృందాల నైపుణ్యాన్ని మరోసారి చూపిస్తుంది. ఇది ప్రపంచ స్థాయి గుండె సంరక్షణ అందించాలనే కేర్ హాస్పిటల్స్(Care Hospitals) అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News