Thursday, March 12, 2026
Homeఆరోగ్యంCoconut | కొబ్బరినీళ్లు ఎంతో ఆరోగ్యకరం..

Coconut | కొబ్బరినీళ్లు ఎంతో ఆరోగ్యకరం..

  • డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు..
  • గుండెకు కూడా ఎంతో మంచిది..
  • ఎన్నో ప్రయోజనాలున్న వైద్య నిపుణులు..

వేస‌వికాలం అన‌గానే మండే ఎండ‌, అధిక చెమ‌ట‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు గుర్తుకు వ‌స్తాయి. వేస‌వికాలంలో శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. చెమ‌ట ద్వారా శ‌రీరం ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా కోల్పోతుంది. దీని వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు పెరుగుతాయి. శ‌రీరం హైడ్రెటెడ్ గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌రుగుతుంది. శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

మెద‌డు పనితీరు కూడా మెరుగుప‌డుతుంది. క‌నుక వేస‌విలో ద్ర‌వాల‌తో పాటు ద్ర‌వాలు ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా బ‌య‌ట ఎక్కువ‌గా ప‌నిచేసే వారు ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అయితే చ‌క్కెర‌లు ఎక్కువ‌గా ఉండే శీత‌ల పానీయాల కంటే కొబ్బ‌రి నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

- Advertisement -

కొబ్బ‌రి నీరు శ‌రీరాన్ని త్వ‌ర‌గా హైడ్రేట్ చేస్తుంది. ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగిన త‌రువాత కొబ్బరి నీటిని తీసుకోవ‌డం మంచిది. చెమ‌ట కార‌ణంగా శ‌రీరం ముఖ్య‌మైన ఖ‌నిజాల‌ను కోల్పోతుంది. కొబ్బ‌రి నీటిని తాగ‌డం వ‌ల్ల పొటాషియం, సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ తిరిగి శ‌రీరానికి అందుతాయి. వేస‌విలో జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం స‌హ‌జం. కొబ్బ‌రి నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల దీనిలో ఉండే బ‌యోఆక్టివ్ ఎంజైమ్స్, స‌హ‌జ ఆల్క‌లైన్ గుణాలు జీర్ణాశ‌యానికి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి.

దీంతో ఆమ్ల‌త్వం, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వేస‌వికాలంలో శ‌క్తిని త్వ‌ర‌గా కోల్పోతూ ఉంటారు. అటువంటి స‌మ‌యంలో కొబ్బ‌రి నీటిని తాగ‌డం వ‌ల్ల దీనిలో ఉండే స‌హ‌జ చ‌క్కెర‌లు, మెగ్నీషియం శ‌రీరానికి స్థిర‌మైన శ‌క్తిని అందిస్తాయి. కొబ్బ‌రి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. క‌నుక ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల బీపీ అదుపులో ఉండ‌డంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఈ విధంగా కొబ్బ‌రి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News