పాకిస్థాన్‌పై ఇండియా చేసిన యుద్ధం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)కి శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. దీపావళి (Diwali) సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. భారత ధర్మాన్ని కాపాడటంతోపాటు పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) కి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని తెలిపారు. ‘ఈసారి దీపావళి పర్వదినానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మావోల (Maoists) చెర నుంచి స్వేచ్ఛ పొందిన దేశంలోని అనేక జిల్లాలతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ దివ్వెల పండుగ జరుపుకున్నారు’ అని వెల్లడించారు. మనం తినే ఆహారంలో నూనె వినియోగాన్ని పది శాతం తగ్గిద్దామని సూచించారు.
