- ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్…
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని వార్డు ఆఫీస్ నుండి అప్పారెల్ పార్క్ మైసమ్మగూడ వెళ్లే దారిలో దొమ్మ నరసింహ ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న మ్యాన్ హోల్ ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమని అని గుండ్లపోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ అన్నారు, గత కొన్ని నెలలుగా ఈ మ్యాన్ హోల్ గుంత ఇలాగే పగిలిపోవడంతో ఉదయం సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కుండ భానుచందర్ తెలిపారు.
ఈ ప్రధాన దారి గుండా నిత్యం వందలాదిమంది మల్లారెడ్డి కాలేజీకి చెందిన విద్యార్థులు వెళుతూ ఉంటారు, అలాగే పక్కనే ఉన్న అప్పారెల్ ఎక్స్పోర్ట్ పార్క్ లో పనిచేసే వివిధ కంపెనీల కార్మికులు ఈ రోడ్డు ద్వారా వెళ్తారు,ఈ దారి గుండా హెవీ వెహికల్స్ వెళ్లడంతో గతంలో చాలా ప్రమాదాలు జరుగాయని భానుచందర్ గుర్తు చేశారు, ఈ ప్రధాన రహదారిలో అనేక చోట్ల మ్యాన్ హోల్ లు పగిలిపోయి తెరిచి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలినడకన వెళ్తున్న ప్రజలు భయపడుతున్నట్లు పేర్కొన్నారు, మ్యాన్ హోల్ లో నాణ్యత లేకపోవడం వల్లే పలుమార్లు పగిలిపోతున్నాయని తెలిపారు.
చుట్టుపక్కల స్కూళ్లు ఉండడంతో ఏ సమయాన ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు, ఇకనైనా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకొని ఈ మ్యాన్ హోల్ సమస్యను పరిష్కరించాలని అలాగే సదర్ కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలని గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు భానుచందర్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
