Thursday, March 26, 2026
Homeరంగారెడ్డిHayathnagar | భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన

Hayathnagar | భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన

  • కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మహేశ్వరి కాలనీ, పద్మాలయా కాలనీ మరియు సూర్యనగర్ ఎక్స్‌టెన్షన్ కాలనీలలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను మంగళవారం స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు మహేశ్వరి కాలనీలో 31.00 లక్షలు, పద్మాలయా కాలనీలో 25.60 లక్షల వ్యయంతో, సూర్య నగర్ ఎక్స్టెన్షన్ కాలనీలో 25.50 లక్షల అంచనా వ్యయంతో, నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసామని ఆయన అన్నారు.

ఈ పనులతో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, మురుగు రోడ్లపైకి రావడం, దుర్వాసన, దోమల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన తెలిపారు.ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు భంగం కలిగించే డ్రైనేజ్ సమస్యలను పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నాం. అదేవిధంగా దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో  పాత గ్రామంలోని జాంబవంత్ యువజన సంఘం (తోట్ల బస్తీ)లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

పాత గ్రామంలోని వివిధ వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రజక భవనం, జవహర్లాల్ నెహ్రూ సీనియర్ సిటిజన్ భవనం, అభ్యుదయ యువజన సంఘం(అనుమాగల్), జాంబవంత్ యువజన సంఘాలకు నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి కాలనీ అభివృద్ధి చేయడం నా బాధ్యత. గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను.

డివిజన్ మొత్తాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం అని తెలిపారు. సంవత్సరాలుగా ఉన్న డ్రైనేజ్ సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించిందని కాలనీ వాసులు నవజీవన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, కాలనీల అధ్యక్షులు శంకర్ గౌడ్, జానారెడ్డి ,కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు,బస్తీ వాసులు, కొంగరి నరసింహ, ఎర్ర నాగరాజ్, నర్సింగ్ రావు, అడివయ్య, యాదగిరి, బాలకృష్ణ, వెంకటేష్, నరేందర్, సావిత్రి, అనసూయ, శోభమ్మ, యాదమ్మ, బాలకృష్ణ మరియు బిజెపి నాయకులు బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News