Saturday, October 4, 2025
ePaper
HomeతెలంగాణHARISH RAO | కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నాశనం చేసింది

HARISH RAO | కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నాశనం చేసింది

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగంలో గత రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకుల బృందం ఎల్బీ నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(TIMS) ఆసుపత్రి వద్ద నిలిచిపోయిన నిర్మాణ పనులను పరిశీలించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయకపోతే, ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హరీశ్ రావు(Harish rao) హెచ్చరించారు. కరోనా తర్వాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్టమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రూపొందించారని , కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ దూరదృష్టి లేదని ఆయన ఆరోపించారు.

సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందేలా కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టూ నాలుగుటిమ్స్ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను, అలాగే నిమ్స్ లో 2,000 పడకల విస్తరణను చేపట్టారని గుర్తు చేశారు. గత ఆరు నెలలుగా బస్తీ దవాఖానాల సిబ్బందికి జీతాలు చెల్లించట్లేదని, ప్రతీ నెల 1వ తేదీన జీతాలు ఇస్తానని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేసారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హరీష్ రావు(Harish rao) డిమాండ్ చేసారు.

కాంగ్రెస్ పాలనలో గత రెండేళ్లుగా పనులు నిలిచిపోవడంపై హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణ, బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ, టెండర్లు, డిజైన్లు మరియు నిధులను ఖరారు చేసినా, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసారని మండిపడ్డారు.

హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు టిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News