సినిమా థియేటర్ ఓపెనింగ్(Movie Theater Opening)కి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ(Ashok Nagar Central Library)కి వెళ్లే దమ్ముందా? అని మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే(Siddipet MLA) హరీష్ రావు సవాల్ విసిరారు. నాడు ఎన్నికల సమయంలో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు ఎందుకు మొహం చూపడం లేదు అని నిలదీశారు. వేలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య సినిమా థియేటర్‌కి వెళ్లే సమయం ఉన్న సీఎంకు నిరుద్యోగులను కలిసే సమయం లేదా? అని ప్రశ్నించారు. ‘నువ్వు ప్రారంభించే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడాలి’ అని డిమాండ్ చేశారు. లైబ్రరీకి వెళ్లకుండా తోక ముడుచుకొని పారిపోతే నిరుద్యోగులను మోసం చేసినట్లేనని మండిపడ్డారు. ‘జాబ్ క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వనే లేదు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యం అని మంత్రి శ్రీధర్ బాబు ఎలా అంటారు?. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించారు. ఇప్పుడు నయవంచన చేశారు’ అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
