అలంపూర్ ఎమ్మెల్యే(Alampur Mla), బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు(BRS Party Leader) విజయుడి(Vijayudu)పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(Congress MP Mallu Ravi) దుర్భాషలాడుతూ చేయిచేసుకోవడం దారుణం, అప్రజాస్వామికమని మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు(Siddipet Mla Harish Rao) అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిపై దాడి చేయడం అంటే ప్రజల తీర్పుపై దాడిగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఘటనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. మల్లు రవి తక్షణమే క్షమాపణ(Sorry) చెప్పాలని డిమాండ్(Demand) చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను బెదిరించడం, దాడి చేయడమేనా ప్రజా పాలన(Prajapalana) అని నిలదీశారు. దాడికి పాల్పడిన మల్లు రవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -
