Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణఆదాబ్ హైదరాబాద్ కథనానికి స్పందన

ఆదాబ్ హైదరాబాద్ కథనానికి స్పందన

  • హరిజనవాడ-2 ప్రధానోపాధ్యాయుడు వేముల యాదగిరి సస్పెండ్..
  • 20 రోజుల తర్వాత సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి.
  • ఆదాబ్ కథనాలతో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయుడు సస్పెండ్..
  • ఆదాబు అభినందనల వెల్లువ..

హరిజనవాడ -ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విధులకు సరిగా హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు విధులు పేరుతో బయట తిరుగుతున్న సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు 2 పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేముల యాదగిరి పై ఆగస్టు 30వ తేదీన ఆదాబ్ “పర్యవేక్షణ లోపం.. విద్యాశాఖ అలసత్వం” అనే కథనాన్ని ప్రచురిం చింది. ఈ వార్త కథనంపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని విచారణ చేపట్టి 20 రోజుల తర్వాత ఆ ఉపాధ్యాయుడు పై శాఖపరమైన చర్యలలో భాగంగా సస్పెండ్ చేస్తూ గురువారం జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వు ໖ (No 8415/B3/2025 Dt:17/09/2025) . వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో అలసత్వం, ఇతర కారణాలవల్ల సస్పెండ్ అయినప్పటికీ, ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారి, వారి వద్ద ముడుపులు తీసుకొని వారికి అనుకూలంగా ఉన్న పాఠ శాలల్లో పోస్టింగులు ఇస్తున్నారు అనే అపవాదు లేకపోలేదు.

ఉపాధ్యాయులపై ఆదాబ్ ఉక్కు పాదం :

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల ప్రవర్తనతో ఆ శాఖకే మచ్చ తెస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయులపై ఆదాబ్ ఉప్పు పాదం మోపింది. విధులకు హాజరుకాకుండా పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన సమయంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చిట్టి పాటలు, వైన్ షాప్ ల నిర్వహణ, టూర్ల పేరుతో జల్సాలు చేస్తూ బయట తిరుగుతున్న ఉపాధ్యాయులపై ఆదాబ్ నిఘా పెట్టింది. ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ప్రధానోపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయుడు పై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఆదాబ్ కృషి ఉందని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఆదాబ్ వెలుగులోకి తెచ్చిన కథనాలు :

గతంలో ఆత్మకూర్ (ఎస్) మండలం, నెమ్మికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయుడు పిల్లుట్ల శ్రీహరి అందులో పని చేస్తున్న గిరిజన మహిళ ఉపాధ్యాయురాలను హరాజ్మెంట్ చేస్తున్న విషయాలను ఆదాబ్ వెలుగులోకి తీసుకువచ్చింది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బిబి తండా ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటి గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏ. నరేందర్ పాఠశాలకు రాకుండా సొంత పనులు చేసుకుంటూ బయట తిరుగుతున్నాడు. ఆ విషయాలను పక్క ఆధారాలతో ఆదాబ్ వెలుగులోకి తీసుకురావడంతో అతనిపై కూడా శాఖపరమైన చర్యలలో భాగంగా సస్పెండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లాకు ఆనుకుని ఉన్న మండలంలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని తీసుకొచ్చి, జిల్లా కార్యాలయంలో ఏ పీఓ గా నియమించారు. ఆ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకురావడంతో, ఆ టీచర్ ను జిల్లా కార్యాలయం నుండి ఆత్మకూరు మండల పరిధిలోని ఓ పాఠశాలకు బదిలీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News