- నేషనల్ ఫ్లాగ్ కప్పుకుని లవర్ తో రొమాన్స్..
- తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్న నెటిజన్లు..
టీ20 ప్రపంచకప్ 2026 గ్రాండ్ విక్టరీ తర్వాత సంబరాల్లో మునిగిపోయిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు చట్టపరమైన సమస్యలను చిక్కుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన వేళ మైదానంలో హార్దిక్ చేసిన కొన్ని పనులు ఈ వివాదానికి దారితీశాయి.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా తన భుజాలపై జాతీయ జెండాను చుట్టుకుని మైదానమంతా పరుగెత్తుతూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి పోడియంపై పడుకుని వేడుకలు చేసుకున్న సమయంలో కూడా జాతీయ జెండాను శరీరంపైనే ఉంచుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -
