Monday, March 30, 2026
Homeఆరోగ్యంBrain Boost | జ్ఞాపకశక్తి కోల్పోయారా భయపడకండి..

Brain Boost | జ్ఞాపకశక్తి కోల్పోయారా భయపడకండి..

  • కీలక పాత్ర పోషించనున్న గత్ మైక్రోబియోమ్
  • జ్ఞాపకశక్తి తగ్గుదలను తిరిగి పొందవచ్చు..

వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుదల సాధారణంగా కనిపించే సమస్య. అయితే వృద్ధాప్యంతో వచ్చే జ్ఞాపకశక్తి తగ్గుదలను తిరిగి మెరుగుపరచడంలో గట్ మైక్రోబియోమ్ (మంచి బ్యాక్టీరియా) కీలక పాత్ర పోషించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గట్ (జీర్ణ వ్య‌వ‌స్థ‌) నుంచి మెదడుకు సంకేతాలు పంపే వెగస్ నర్వ్‌ను ఉత్తేజితం చేయడం ద్వారా ఈ ప్రభావం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వయస్సు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలకు గట్‌లో పరిష్కారాలను కనుగొనే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి.

కొంతమంది వృద్ధులు ఎందుకు మానసికంగా చురుకుగా ఉంటారో, మరికొందరిలో 50-60 ఏళ్ల వయస్సు నుంచే జ్ఞాపకశక్తి తగ్గుదల ఎందుకు మొదలవుతుందో తెలుసుకోవడమే ల‌క్ష్యంగా ఈ ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. జ్ఞాపకశక్తి తగ్గుదల అనేది ముందే నిర్ణయించబడిన ప్రక్రియ కాదని, శరీరంలోని పలు వ్యవస్థలు దీనిని ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఈ ప్రక్రియలో కీలక నియంత్రకంగా పనిచేస్తుందని నిపుణులు వెల్లడించారు.

- Advertisement -

నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఎలుకలపై నిర్వహించారు. గట్‌లో సహజంగా నివసించే సూక్ష్మజీవుల సమూహమైన గట్ మైక్రోబియోమ్ వయస్సుతో మార్పులకు లోనవుతుందని పరిశోధకులు గుర్తించారు. కొన్ని బ్యాక్టీరియా జాతులు పెరగడం, మరికొన్ని తగ్గడం వల్ల ఈ మార్పులు జరుగుతాయి. ఈ మార్పులను గమనించే గట్‌లోని ఇమ్యూన్ కణాలు ఇన్‌ఫ్లమేటరీ ప్రతిస్పందనను ప్రారంభిస్తాయి. ఈ ఇన్‌ఫ్లమేషన్ వల్ల వెగస్ నర్వ్ పనితీరు దెబ్బతిని, మెదడులో జ్ఞాపకశక్తి, మార్గదర్శకతకు బాధ్యత వహించే హిప్పోకాంపస్‌కు సంకేతాలు సరిగా చేరవు.

దీంతో జ్ఞాపకశక్తి తగ్గుదల కనిపిస్తుంది. పరిశోధనలో భాగంగా వృద్ధ ఎలుకలలో వెగస్ నర్వ్‌ను ఉత్తేజితం చేయగా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. ముందుగా మరిచిపోయే లక్షణాలు ఉన్న ఎలుకలు, ఉత్తేజితం అయిన‌ తర్వాత యువ ఎలుకల మాదిరిగా కొత్త వస్తువులను గుర్తించడం, మార్గాలను గుర్తించడం వంటి పనులను సులభంగా చేయగలిగాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News