Sunday, February 22, 2026
Homeఅంతర్జాతీయంPresidential Elections | గినియాలో అధ్యక్ష ఎన్నికలు

Presidential Elections | గినియాలో అధ్యక్ష ఎన్నికలు

గినియా(Guinea) దేశంలో ఈ రోజు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. 2021 తిరుగుబాటు(Coup) తర్వాత అక్కడ ఎలక్షన్లు నిర్వహించటం ఇదే తొలిసారి. కాగా.. ఈ ఎన్నికల్లో జుంటా లీడర్(Junta Leader) జనరల్ మమాది డౌంబౌయా(Mamady Doumbouya) గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. నాలుగేళ్ల కిందట డౌంబౌయా.. అధ్యక్షుడు ఆల్ఫా కాండేను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత ప్రారంభమైన పరివర్తన ప్రక్రియలో ఇవాళ జరిగిన ఎన్నికలు కీలక పరిణామమని పరిశీలకులు భావిస్తున్నారు. జుంటా నాయకుడు ప్రధాన ప్రతిపక్షాన్ని(Main Opposition), అసమ్మతిని అణిచివేయడం ప్రారంభించాడని విమర్శకులు అంటున్నారు. దీంతో బరిలో ఉన్న 8 మంది అభ్యర్థుల్లో అతనికి పెద్దగా పోటీ ఇచ్చేవారు లేరని చెబుతున్నారు. గినియాలో గొప్ప ఖనిజ వనరులు(Minerals) ఉన్నప్పటికీ.. ఆ దేశంలోని 15 మిలియన్ల జనాభాలో సగానికి పైగా ప్రజలు రికార్డు స్థాయిలో పేదరికం(Poverty), ఆహార అభద్రతను అనుభవిస్తున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News