త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ శాఖ ముఖ్య నిర్ణయం తీసుకుంది. రూ.79 వేల కోట్ల ఖర్చుతో ఆయుధాలు, సైనిక పరికరాలను కొనేందుకు అనుమతించింది. నాగ్ క్షిపణి వ్యవస్థ (NAMIS), టార్పిడోలు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు తదితరాలను కొంటారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన భేటీ అయిన డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్(DAC) ఈ ప్రతిపాదనలను ఓకే చేసింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఆయుధాల కొనుగోలుకు సంబంధించి ఇది రెండో అతిపెద్ద నిర్ణయం కావటం విశేషం. గతంలో రూ.67 వేల కోట్ల ప్రతిపాదనలను ఆమోదించారు.
