Wednesday, March 25, 2026
Homeకరీంనగర్Vande Mataram | ‘కరీంనగర్’లో ఘనంగా నిర్వహణ

Vande Mataram | ‘కరీంనగర్’లో ఘనంగా నిర్వహణ

కరీంనగర్, నవంబర్ 7 (ఆదాబ్ హైదరాబాద్): మహాకవి బంకించంద్ర ఛటర్జీ రచించిన భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ నేటి(2025 నవంబర్ 7)తో 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారకోత్సవాన్ని కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌(Karimnagar Police Commissionerate)లో ఘనంగా నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ (Police Commissioner) గౌష్ ఆలం పాల్గొన్నారు. వందేమాతరం గేయాన్ని అధికారులు, సిబ్బందితో కలిసి సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం గీతం స్వాతంత్య్ర సంగ్రామం (Freedom Fight)లో కోట్లాది మంది భారతీయుల(Indians)కు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి(Patriotism)ని పెంపొందించే గొప్ప శక్తి (Great Power) ఈ గీతంలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఆర్ఐ కిరణ్ కుమార్‌తోపాటు కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గేయాన్ని ఆలపించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News