దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) సోమవారం హైదరాబాద్‌లోని చార్మినార్‌లో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని (Bhagyalakshmi) కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. తెలంగాణ ప్రజలకు దీపావళి (Diwali) శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరి జీవితంలోనూ వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
