Sunday, March 1, 2026
Homeహైదరాబాద్‌MLA | ప్రజాపాలనలో మెరుగైన వైద్య సేవలు లబ్యం

MLA | ప్రజాపాలనలో మెరుగైన వైద్య సేవలు లబ్యం

  • ఎమ్మెల్యే శ్రీ గణేష్
  • రమాదేవికి రూ.2.50 లక్షల ఎల్.ఓ.సీ మంజూరు

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి లాల్ బజార్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ గౌడ్ సతీమణి రమాదేవి అనారోగ్యానికి గురై నిజాం ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్(నిమ్స్) లో చేరారు.వైద్యులు ఆమెకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రమాదేవి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్‌ను సంప్రదించగా,ఆయన తన కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేయించారు.

ఫలితంగా రమాదేవికి రూ.2 లక్షల 50 వేల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు అయింది.శనివారము నాడు ఎమ్మెల్యే నివాసం వద్ద రమాదేవి కుటుంబ సభ్యులకు LOC పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవకుండా,మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీ ముదిరాజ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News