Friday, September 12, 2025
ePaper
spot_img
Homeతెలంగాణకృత్రిమ మేధతో ప్రభుత్వ పాలన

కృత్రిమ మేధతో ప్రభుత్వ పాలన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)తో పరిపాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అన్నిశాఖల్లో ఏఐ ద్వారానే పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. భూముల సర్వే, సెటిల్మెంట్లు, రెవెన్యూ, హౌజింగ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఇలా అన్ని విభాగాలను ఏఐ ద్వారానే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చేలా ఏఐని వాడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

అన్ని శాఖల్లోనూ ఏఐ ద్వారానే పనులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని పొంగులేటి అన్నారు. ఏఐ ఆధారిత పాలనను అందించేందుకు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రస్తుతం తాము స్వల్ప స్థాయిలోనే ఏఐని వినియోగిస్తున్నామని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News