వాయిద్య పరికరాలను పంపిణీ చేసిన సీఎం రేవంత్
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణను అందజేశారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి వాయిద్య పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యక్షంగా పాట పాడి వినిపించారు. ఆ తర్వాత వారు పాడిన పాటల సీడీని సీఎంతో పాటు మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
