స్వర్ణకార యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులకు నూతన ఐడి కార్డులను స్వర్ణ కార్ యూనియన్ అధ్యక్షుడు కొండోజు ఆంజనేయ చారి ఘనంగా పంపిణీ చేశారు. ఈ ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ప్రతి స్వర్ణకారుడు విధిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, ఇది వృత్తిపరంగా వారికి ఎంతో రక్షణనిస్తుందని తెలిపారు.
ముఖ్యంగా, ఈ ఐడి కార్డు కలిగిన వారికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా అత్యవసర సమయాల్లో రూ. 2 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించేలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మహేశ్వరం వేణుగోపాల్ చారి మాట్లాడుతూ స్వర్ణకారుడు విధిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని ఈ గుర్తింపు కార్డు వల్ల ఎంతో ఉపయోగకరమని ఏదైనా ప్రమాద జరిగితే ప్రమాదం భీమా వర్తిస్తుందని ఆయన చెప్పారు అందరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డు పొంది ఉండాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఏ.సి.పి. కిరణ్ కుమార్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరి రాధాకృష్ణ గారు, కోశాధికారి దానీ ప్రసాద్ చారి, గౌరవ అధ్యక్షులు బోగాది విశ్వనాథ్ చారి, కార్యదర్శి కొత్తా సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు
