Monday, October 27, 2025
ePaper
Homeబిజినెస్GOLD: లక్షా 35 వేలు దాటిన బంగారం ధర

GOLD: లక్షా 35 వేలు దాటిన బంగారం ధర

హైదరాబాద్‌లో బంగారం ధర లక్షా 35 వేలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు తాజాగా రూ.1,35,250 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,725కి చేరింది. కిలో వెండి రేటు రూ.1,81,000గా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు పండగ సీజన్ గోల్డ్‌కి కలిసొచ్చింది. దీంతో దేశీయంగా చుక్కలు చూపిస్తోంది. అమెరికా షట్‌డౌన్‌ను ఎత్తేస్తారో లేదో తెలియట్లేదు. దీనికితోడు యూఎస్, చైనా వాణిజ్య యుద్ధం వల్ల బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్‌లకు గిరాకీ నెలకొంది. ధనత్రయోదశి రోజు ప్రజలు బంగారం, వెండి తదితర విలువైన వస్తువులు కొంటారు. దీనివల్ల లక్ వరిస్తుందని, సంపద పెరుగుతుందని నమ్ముతారు. ఈ సెంటిమెంట్ కారణంగా స్వర్ణం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సైతం బంగారం డిమాండ్ పెరగటానికి దారితీస్తోంది. 2026 ప్రారంభం నాటికి గోల్డ్ రేటు లక్షన్నర పలికినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News