Monday, October 27, 2025
ePaper
Homeకరీంనగర్godavarikhani | 'ఖని' పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

godavarikhani | ‘ఖని’ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

  • యువత భాగస్వామ్యంతోనే నేర రహిత సమాజం,
  • సీపీ అంబర్ కిషోర్ ఝా

అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సీపీ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గోదావరిఖని ఎం.రమేష్ లు సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రాణాలు కాపాడే రక్తదానం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు,అలాగే అక్టోబర్ 21 పోలీసు వారోత్సవాల సందర్భంగా ప్రజల రక్షణ, అత్యవసర సమయాల్లో 24 గంటలు విధి నిర్వహణలో పోలీసులు ఎలా పనిచేస్తారో వివరించారు.

ముఖ్యంగా, తలసేమియా వ్యాధిగ్రస్తులకు అత్యవసర రక్తాన్ని అందించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.యువత భవిష్యత్తులో పోలీసు శాఖలో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో సమాజ శ్రేయస్సు,నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకొచ్చి సహకరించాలని సూచించారు.పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేష్, పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో పాటు నగరంలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,యువకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.మంచిర్యాల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు,ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News