సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి గాడ్ మోడ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పక్కా మాస్ ఎనర్జీతో ఊపేస్తూ, థియేటర్లలో విజిల్స్ పండించే డ్యాన్స్ నెంబర్‌గా నిలుస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్‌గా, క్యాచీగా ఉండి ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేలా ఉనాయి. కాల భైరవ బ్వాయిస్ ఈ పాటకు అదనపు పవర్ ఇచ్చి, ప్రతి బీట్‌ను మరింత ఎలివేట్ చేశారు.
ముఖ్యంగా ఈ సాంగ్‌లో సూర్య చూపించిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. స్టైల్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిపి ఆయనను మరింత స్పెషల్‌గా చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వైరల్ హంగామా సృష్టిస్తోంది. మొత్తానికి “గాడ్ మోడ్” సాంగ్ సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ.
2026 మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్ రెడ్డి
రచన & దర్శకత్వం: RJ బాలాజీ
సినిమాటోగ్రఫీ – జికె విష్ణు
సంగీతం – సాయి అభ్యంకర్
యాక్షన్ అన్బరివ్ – విక్రమ్ మోర్
ఎడిటర్ – ఆర్.కళైవానన్
ప్రొడక్షన్ డిజైన్ – అరుణ్ వెంజారామూడు
నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
పీఆర్వో – వంశీ-శేఖర్
