Wednesday, March 4, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐGTA | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సదస్సు

GTA | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సదస్సు

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(Global Telangana Association-GTA) సదస్సు ఇటీవల హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసుల(Telangana People)ను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 30 దేశాల ప్రతినిధులు వేల సంఖ్యలో పాల్గొన్నట్లు జీటీఏ వ్యవస్థాకుడు, గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి చెప్పారు. వంద మందికి పైగా ఆర్టిస్టుల(Artists)తో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాలను ప్రదర్శించారు. సింగర్ మంగ్లీ(Singer Mangli) లైవ్ మ్యూజికల్ నైట్(Live Musical Night), మోహన భోగరాజు స్పెషల్ షో ఆకట్టుకున్నాయి. రియల్ ఎస్టేట్, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలు తదితర అంశాలపై స్పెషల్ సెషన్లను ఏర్పాటుచేశారు. చినజీయర్ స్వామి, కిషన్ రెడ్డి, వివేక్; బల్మూరి, చామల, మల్లారెడ్డి, గువ్వల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News