- పిల్లల పట్ల పర్యవేక్షణ కరువు
నల్లబెల్లి: విద్యార్థులు అవమానించారనే మనస్థాపంతో ఓ బాలిక ఆ@త్మహ@త్యాయ@త్నం చేసుకున్న సంఘటన గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో జరిగింది. మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామంలో గల గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ బాలిక ఆ@త్మహ@త్యాయ@త్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఆశ్రమ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది.
తోటి స్నేహితులు అవమానపరిచారని మనస్థాపానికి గురై బుధవారం రాత్రి ఎలర్జీ కి సంబంధించిన లోషన్ తాగి ఆ@త్మహ@త్యయ@త్నానికి పాల్పడింది. విషయం తెలిసిన విద్యార్థులు వార్డెన్ కు తెలుపగా ఉంటేనే వచ్చిన వార్డెన్ విద్యార్థులను మందలించి ఆ@త్మహ@త్యాయ@త్నానికి పాల్పడిన బాలికను నర్సంపేట ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు వార్డెన్ స్వరూప తెలిపారు. చికిత్స అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ట్రైనింగ్ లో ఉన్నట్లు ,ఇన్చార్జి హెచ్ఎం అందుబాటులో లేడని విద్యార్థులు తెలిపారు.
