- ప్రతి మార్చి ఆదివారాలలో ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం !!
- జోనల్ కార్యాలయం – శంషాబాద్
- Greater Hyderabad Municipal Corporation (జిహెచ్‌ఎంసీ)
ప్రజలకు తెలియజేయబడినది ఏమనగా, జిహెచ్‌ఎంసీ ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రతి ఆదివారం “ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం (PTP)” కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆస్తి పన్ను సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించబడతాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా “ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం” కార్యక్రమాన్ని మార్చి నెలలో ప్రతి ఆదివారం సర్కిల్ (ఆదిబట్ల-15, బడంగ్‌పేట-16, జలపల్లి-17, శంషాబాద్-18) తేదీ: 01.03.2026,08.03.2026,15.03.2026,22.03.2026&29.03.2026 ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సంబంధిత డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలలో నిర్వహించవలసిందిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో క్రింది అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయనీ అన్నారు.
- ఫిర్యాదుల పరిష్కారం
- రివిజన్ పిటిషన్లు (RPs)
- ఆస్తి పన్ను అంచనాల సవరణలు
- బిల్ కలెక్టర్ల ద్వారా / RTGS ద్వారా చెల్లించిన మొత్తాల నమోదు
- ఆన్‌లైన్ బకాయిల సవరణలు
- కోర్టు కేసుల పరిష్కారం
- IGRS సంబంధిత సమస్యలు
- స్వీయ అంచనా (Self Assessment) విషయాలు
- ఇతర ఆస్తి పన్ను సంబంధిత అంశాలు
శంషాబాద్ జోన్ పరిధిలోని అన్ని ఆస్తి యజమానులు మరియు పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవలసిందిగా కోరడమైనది. నాలుగు సర్కిల్ లో గల ఇంటి యజమనులకు వాణిజ్య దుకాణం యాజమానులకు తలియ పరచునది యమనగా ఈ ఆర్దిక సంవత్సరం చివరి నెల మార్చి 31 లోపు తమ తమ ఇంటి పనులు చలించవలసిందిగా తెలిపారు.
జోనల్ కార్యాలయం – శంషాబాద్
జిహెచ్‌ఎంసీ
