Wednesday, March 25, 2026
HomeతెలంగాణBJP vs MIM | జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం

BJP vs MIM | జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం

  • వందేమాతరం గీతానికి అవమానం
  • సీట్లలోంచి లేవని.. ఎంఐఎం సభ్యులు
  • బీజేపీ అభ్యంతరంతో తీవ్ర వాదోపవాదాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం తీవ్ర గందరగోళం నెలకొంది. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వందేమాతర గీతం పాడితేనే దేశంలో ఉండాలంటూ వారు బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో బీజేపీకి వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల కార్పొరేటర్లు..

ఈ సమావేశంలో టేబుల్స్ ఎక్కి హంగామా చేశారు. దాంతో మార్షల్స్ రంగంలోకి దిగి… వారిని బయటకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ రెండు పార్టీల కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు జరుగుతున్న జీహెచ్ఎంసీ పాలక మండలి తుది సమావేశం. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియనుంది.

- Advertisement -

ఈ సమావేశం లో 95 ప్రశ్నలు, 45 అజెండ అంశాలపై చర్చించాల్సి ఉంది. ఈ తుది సమావేశానికి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతోపాటు సిటీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. పారిశ్రామిక వాడల భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలం టూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీ కార్యాలయానికి నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లారు. రూ.5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ.. రేవంత్ రెడ్డి సర్కార్ దేశంలోనే అతిపెద్ద స్కామ్కు తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్లోని ఇండస్ట్రియల్ కారిడార్ భూములను అమ్ముతున్న పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News