Tuesday, March 3, 2026
Homeనల్లగొండSports And Games | ఆటలతో మేధాశక్తి పెరుగుతుంది

Sports And Games | ఆటలతో మేధాశక్తి పెరుగుతుంది

నారాయణ కాలేజ్ ప్రీమియర్ లీగ్ క్రీడల పోటీల ప్రారంభోత్సవంలో డీఎస్పీ ప్రసన్నకుమార్

సూర్యాపేట, నవంబర్ 8: విద్యార్థులు మేధోపరంగా(Mentally), శారీరకంగా (Physically) వికాసం పొందాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా డీఎస్పీ (Dsp) ప్రసన్నకుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో నారాయణ (Narayana) ప్రీమియర్ లీగ్ జోనల్ లెవల్ క్రీడల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ పాఠశాల ఏజియంలు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జిఎం వెంకటరమణ మాట్లాడారు.

- Advertisement -

నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవల్ క్రీడల పోటీలను సూర్యాపేట నల్లగొండ జిల్లాలో ఉన్న 8 బ్రాంచీలు క్రీడల పోటీల్లో పాల్గొన్నట్లు తెలియజేశారు. సూర్యాపేట ఈ ఎన్ సి ఎస్ ఓఎంసిఎస్ మిర్యాలగూడ ఓఎంసిఎస్, ఈఎన్సీఎస్ నల్గొండ ఈఎంసిఎస్, ఓఎంసీఎస్, కోదాడ ఈఎంసిఎస్ చౌటుప్పల్ ఎంసిఎస్ నకిరేకల్ ఈ ఎం ఎస్ బ్రాంచీలోనే జోనల్ లెవెల్ క్రీడలు నిర్వహించి ఈ క్రీడల్లో ప్రతిభ (Talent) కనబరిచిన విద్యార్థులను స్టేట్ లెవెల్ లో పంపించడం జరుగుతుందని ఈ క్రీడల వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి శారీరక మానసిక ఉల్లాసంగా ఎంతో ఉత్సావంతంగా ఉంటారని నారాయణ పాఠశాల విద్యార్థులు చదువు(Study)తోపాటు క్రీడల్లో ముందు వసతులు ఉంటుందని అన్నారు.

ఈ క్రీడల వల్ల విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుటకు మానసిక ఉల్లాసంతో అల్లాదకరంగా ఉంటారని వీరి యొక్క మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండకుండా క్రీడల వల్ల ప్రశాంతమైన నిచ్చల స్థితిలో మనసును నిమగ్నమై ఎంతో చురుకుగా పాల్గొంటారని ఈ విధంగా ఉండటం వల్ల విద్యార్థు లు చదువుల్లో అన్ని రంగాల్లో బాగా రాణిస్తారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వివిధ బ్రాంచీల నుంచి వచ్చిన పిఈటిలు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News