- సర్పంచ్ గాడిపెల్లి మహేందర్.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్ మాట్లాడుతూ నేటి యువత వివేకానందుని ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకుపోవాలని అన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు చేబెల్లి మహేందర్ మాట్లాడుతూ అంటరానితనం, కుల ఆధారిత అసమానతలను తొలగించడం ద్వారా సనాతన ధర్మాన్ని భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాలి అన్న స్వామి వివేకానంద మాటలు నేటి సమాజం ఆచరించాలి అని అన్నారు.

వివేకానందుని జయంతిని పూరస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులను గౌరవంగా సన్మానించి, పేదలకు పండ్లు పంపిణి చేశారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు బత్తిని జలందర్, ఉపాధ్యక్షులు సంతోష్, గ్రామ కార్యదర్శి మోహిన్ బుర్ర సంతోష్, కనుకుంట్ల రాజమహేందర్, ఆర్. దామోదరా చారి, నాగేల్లి దర్గయ్య, జి. ప్రేమిచంద్, రత్నాకర్, రతన్, సాయిరాం వార్డు సభ్యులు, రవి, నాగరాజు, పవన్ కళ్యాణ్, రాజబాబు స్థానిక పెద్దలు, యువకులు పాల్గొన్నారు.


