- తృటిలో తప్పిన ప్రాణ నష్టం మంటలార్పిన అగ్ని మాపక సిబ్బంది
- పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలు
- కాలుష్య నియంత్రణ, భద్రతా అధికారులు తూ తూ మంత్రంగా తనిఖీలు
- ఏటా జరుగుతున్న బారి అగ్ని ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోతున్న అమాయక కార్మికులు
గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక వాడలో రసాయన పరిశ్రమలో బారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది న్యూట్రల్ కెమికల్ ఇండస్ట్రీలో ట్రై టెక్ క్లోరైడ్ రసాయన ద్రవాన్ని తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ మల్లిఖార్జున్ తెలిపారు పరిశ్రమలో కొన్ని జాగ్రత్తలు లోపాల వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు ప్రమాదంలో భారీగా రసాయన పదార్థాలు దగ్ధమయ్యాయి దాంతో వాతావరణంలో దుర్వాసన వ్యాపించి, ప్రజలు అస్వస్థతకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి


పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయకపోవడం, రసాయన వ్యర్థాల నిల్వలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ప్రతి సారి ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు కదిలి వస్తారు. ముందుగా తనిఖీలు జరిపి ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడం లేదు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి పారిశ్రామిక వాడలో ఉన్న రసాయన పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మరియు భద్రత అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని ఏటా తూ తూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి పరిశ్రమ యాజమాన్యంతో అతిధి మర్యాదలు స్వీకరించి వెళ్లిపోతారని స్థానిక ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


