Thursday, March 5, 2026
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌ నుంచి.. ఇండియాకి..

ఇజ్రాయెల్‌ నుంచి.. ఇండియాకి..

160 మందిని తరలించిన ప్రభుత్వం

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి భారతీయులను ఇండియాకి తరలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇజ్రాయెల్‌పైన ఫోకస్ పెట్టింది. ఆపరేషన్‌ సింధూలో భాగంగా తొలి విడతగా ఆదివారం ఇజ్రాయెల్‌, జోర్డాన్‌ల నుంచి 160 మంది సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ఇజ్రాయెల్‌ గగనతలం మూసివేయడం వల్ల మొదటి విడతలో 160 మందిని మాత్రమే భూమార్గం ద్వారా బోర్డర్ దాటించి జోర్డాన్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఇమ్మిగ్రేషన్‌ చెకింగ్స్ పూర్తయ్యాక అమ్మన్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశామని విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు.. ఇరాన్‌ నుంచి తాజాగా స్పెషల్ ఫ్లయిట్‌లో మరో 311 మంది మనవాళ్లను ఢిల్లీకి చేర్చారు. దీంతో ఇండియాకి చేరుకున్న పౌరుల సంఖ్య 1428కి పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News