బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు (Tensions) నెలకొన్నాయి. స్టూడెంట్ లీడర్ (Student Leader) షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మృతి నేపథ్యంలో ఆందోళనలు చెలరేగాయి. మీడియా ఆఫీసులపై ఎటాక్ (Attack On Media Offices) చేసి నిప్పు పెట్టారు. ఓ న్యూస్ పేపర్ ఎడిటర్‌పై దాడికి దిగారు. దీంతో ఆ దేశంలోని మెయిన్ న్యూస్ పేపర్లు ఇవాళ తమ కార్యకలాపాలను మానుకున్నారు. బంగ్లా తాజా అల్లర్లలో ఓ మైనారిటీ వ్యక్తి(Minority Person)ని ఒక ముఠా పొట్టన పెట్టుకుంది. ఈ గొడవలపై మొహమ్మద్ యూనస్ (Mohammad Yunus) ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. నిరసనకారులు ఓపిగ్గా ఉండాలని, హింసకు పాల్పడొద్దని కోరింది. ప్రసార మాధ్యమ సంస్థలకు సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. పాత్రికేయుల(Journalists)పై జరిగిన దాడి పట్ల విచారం వెలిబుచ్చింది. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. మైనారిటీ వ్యక్తి హత్యను ఖండించింది.
Bangladesh | బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
