- వార్డు ల వారీగా గుండోజి రంగదాసు ఉచిత ట్యూషన్ పాయింట్లు ప్రారంభం.
- పదవ తరగతి పై ప్రత్యేక కార్యచరణ.
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, బండ రావిరాల గ్రామంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఒక గొప్ప ముందడుగు వేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం, గుండోజి రంగదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత ట్యూషన్ పాయింట్లను ఘనంగా ప్రారంభించారు.
ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిని రెండు గ్రూపులుగా విభజించి ప్రత్యేక శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేశారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా నిపుణులైన ఉపాధ్యాయులతో పాటు, గ్రామంలో ఉన్నత చదువులు చదివిన విద్యావంతులైన యువతను ఈ బోధనలో భాగస్వామ్యం చేస్తున్నారు. స్థానిక యువత విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం వల్ల సబ్జెక్టులపై అవగాహన పెరగడమే కాకుండా, వారిలో స్ఫూర్తి నింపుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.

పుట్టినరోజు కానుకగా విద్యా సేవ:
ఈ కార్యక్రమంలో భాగంగా, 3వ వార్డు సభ్యులు కన్నె భరత్ యాదవ్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని తన సొంత వార్డులో ఒక ట్యూషన్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఆడంబరాలకు పోకుండా విద్యార్థుల చదువు కోసం ముందుకు రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచ్ గారి మాటల్లో:
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా విద్యా ప్రమాణాల పెంపునకు మేము కట్టుబడి ఉన్నాము. విద్యార్థుల చద
