Sunday, April 5, 2026
Homeరంగారెడ్డిFree Medical Camp | సీఎంఆర్ ఆసుపత్రి ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం

Free Medical Camp | సీఎంఆర్ ఆసుపత్రి ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం

  • 85 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

సీఎంఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేడ్చల్ డివిజన్ జిహెచ్ఎంసి కార్యాలయ ఆవరణలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి స్థానిక ప్రజలు మంచి స్పందన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మొత్తం 85 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, షుగర్, సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్త పరీక్షలు, కంటి పరీక్షలు కూడా చేపట్టారు.

వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులు ప్రజలకు ఆరోగ్యంపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కాలానుగుణ వ్యాధులు, ఆహారపు అలవాట్లు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. ఇలాంటి వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. సెల్, సాయి శ్రీ, గీత వైద్య బృందం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, వీఆర్వో పి. రఘురాములు పటేల్, ఎం. రాజ్ నారాయణ, కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు తరచూ నిర్వహిస్తే మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News