Monday, October 27, 2025
ePaper
Homeబిజినెస్Nominee | నవంబర్ నుంచి నలుగురు నామినీలు

Nominee | నవంబర్ నుంచి నలుగురు నామినీలు

బ్యాంక్ ఖాతాల(Bank Accounts)కు ఇప్పటివరకు ఒక్కరినే నామినీ(Nominee)గా పేర్కొనే వీలుండగా ఇకపై నలుగురిని నియమించుకోవచ్చు. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం-2025లో చేసిన మార్పులు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 23న ప్రకటించింది. బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం-2025ను ఏప్రిల్ 15న నోటిఫై చేశారు.

ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Rbi) చట్టం-1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Sbi) చట్టం-1955, బ్యాంకింగ్ కంపెనీస్ చట్టం-1970, 1980కి సంబంధించి మొత్తం 19 సవరణల కోసం ఈ చట్టం తెచ్చారు. ఈ మేరకు జులై 29న గెజిట్ (Gazette) ప్రకటన జారీ చేశారు. ఇందులోని కొన్ని నిబంధనలను ఆగస్టు నుంచి అమల్లోకి తేగా నామినేషన్ రూల్స్ నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News