Tuesday, March 3, 2026
Homeఖమ్మంMinister Ponguleti | రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Minister Ponguleti | రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం పర్యటన(Khammam Tour)లో భాగంగా ఏదులాపురం మునిసిపాలిటీ(Edulpuram Municipality)లో రూ.1.07 కోట్ల వ్యయంతో పలు అంతర్గత సీసీ రోడ్ల(CC Roads) నిర్మాణానికి జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, మునిసిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల వివరాలు.. రూ.35 లక్షలతో టెంపుల్ సిటీ, రూ.22 లక్షలతో చిన్నతండా, రూ.25 లక్షలతో సూర్య నగర్‌, రూ.25 లక్షలతో క్లాస్-4 ఉద్యోగుల కాలనీలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఏదులాపురం అభివృద్ధికి గడిచిన రెండేళ్లలో సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఏదులాపురం మునిసిపాలిటీ పరిధిలో 560 మందికి ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Illu) ఇచ్చామని అన్నారు. ఇంకా మూడు విడతలుగా మంజూరు చేస్తామని, ఏప్రిల్‌లో రెండో విడత కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. అర్హులైన ప్రతి పేదవారికీ పక్కాఇల్లు కట్టించి తీరుతామని, ఇంకా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News