Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Gangula Kamalakar | గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలి

Gangula Kamalakar | గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలి

  • మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో వొల్లాల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వొల్లాల చందు గౌడ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్, ముగింపు వేడుకలు ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు విన్నర్, రన్నర్ కప్పుల తో పాటు నగదు బహుమతులను అందించారు. టోర్నమెంట్ ముగింపు వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టోర్నమెంట్ లో గెలిచిన క్రీడాకారులకు మెడల్స్ ప్రధానం చేసి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ అఫ్ ద సిరీస్ లు సాధించిన క్రీడాకారులకు మెమొంటోలను బహుకరించారు.

మ్యాచ్ విన్నర్ కి 25 వేల నగదు బహుమతి, మ్యాచ్ రన్నర్ కి 15వేల రూపాయల నగదు బహుమతులతో పాటు కప్పులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నెలరోజుల పాటు క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా .. మ్యాచ్ లు నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. క్రీడాకారులు క్రీడస్పూర్తిని చాటుతూ గెలుపు ఓటములను సహజంగా తెలుసుకోవాలనీ సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, కొత్తపెల్లి మండలం మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత- మహేష్, కరీంనగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ ఎంపీటీసీ కమల మనోహర్, బావుపేట ఉపసర్పంచ్ భూస కరుణాకర్, ఖాజీపూర్ ఉపసర్పంచ్ పంజాల రమేష్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సురేష్ శేఖర్, టోర్నమెంట్ నిర్వాహకులు వోల్లాల నాగరాజుగౌడ్ జొన్నల మహేందర్ దొగ్గలి నరేష్ బోయిని శ్రీనివాస్ నాయకులు సుధాకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News