- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగింది. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రిక అనేక కథనాలతో అటు సామాన్య జనులకు,ఇటు ప్రభుత్వాలకు ఎంతో మేలు చేసిందని అన్నారు.
నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైందని, సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పత్రికలకు స్వేచ్ఛ చాలా అవసరం అని పేర్కొన్నారు. ప్రజలందరి ఆదరాభిమానాలతో పత్రికా రంగంలో నూతన ఒరవడితో అనధికాలంలోనే విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తున్నదని మాట్లాడారు. పత్రిక యజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
