Monday, March 23, 2026
Homeరంగారెడ్డిTribute | మాజీ ఉప సర్పంచ్ కి ఘన నివాళులు అర్పించిన

Tribute | మాజీ ఉప సర్పంచ్ కి ఘన నివాళులు అర్పించిన

  • స్నేహితులు

మాజీ ఉప సర్పంచ్ కు ఘన నివాళి డ బి ల్ పూర్ ఉప సర్పంచ్ తోటి స్నేహితులు, నాయకులు, స్థానికులు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆకస్మకంగా మృతి చెందారు. సోమవారం గ్రామంలో దశదినకర్మ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ సత్యనారాయణ అందరితో కలిసి మెలిసి ఉంటూ గ్రామంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వారిని గుర్తు చేసుకున్నారు.

సత్యనారాయణ ఆకస్మికంగా మృతి చెందడం తీరని లోటు అని విచారణ వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు అక్రమ పాష, గౌ డవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నాయకులు అశోక్ ముదిరాజ్, ఫణి కుమార్ రాజ్, మహేష్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News