Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిRepublic Day | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధి కిష్టాపూర్ పూడూర్ డివిజన్ లోని కిష్టాపూర్ లో మేడ్చల్ మున్సిపల్ 4వ వార్డు మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యంగం అని, మన దేశానికి గణతంత్ర దేశంగా ప్రకటించిన రోజు ఈ రోజు అని పేర్కొన్నారు. రాజ్యాంగ స్పూర్తిని గుర్తుంచుకొని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దగ్గు వెంకటేష్, తబలిపురం నరేష్, కుమార్, పి అర్జున్, టి రవి, సిహెచ్ బిక్షపతి, పి వెంకీ, పి కృష్ణ, తుడుం ఇవంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News