Sunday, February 22, 2026
Homeరంగారెడ్డిMudiraj Mahasabha | ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

Mudiraj Mahasabha | ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

మల్కాజ‌్‌గిరి, నవంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ ముదిరాజ్ మహాసభ (Telangana Mudiraj Mahasabha) రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి (Legislative Council) డిప్యూటీ ఛైర్మన్ (Deputy Chairman) డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్(Banda Prakash Mudiraj) ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ‌్‌గిరి జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్ ముదిరాజ్ సూచన మేరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ మల్కాజిగిరి మండల అధ్యక్షుడు చెరుకు సాంబరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ ముఖ్య నాయకులతో కలిసి పోస్టర్ (Poster) ఆవిష్కరణ నిర్వహించారు.

ఈ నెల 21న జరగనున్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం (World Fishermen’s Day) సందర్బంగా ప్రతి గ్రామం, మండల, జిల్లా కేంద్రాల్లో జెండా పండుగ(Flag Festival)ను ఘనంగా నిర్వహిస్తు జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, ఆర్గనైజర్ మహేష్ ముదిరాజ్, ప్రసాద్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, కిరణ్ ముదిరాజ్, వంశీ, శివ, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News