కరీంనగర్, నవంబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్): ప్రతి ప్రభుత్వ పాఠశాల(Government School)లో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ టీచర్లు (BioScience Teachers) దృష్టిపెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) ఆదేశించారు. హౌజింగ్ బోర్డ్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యత(Mid Day Meal Quality)ను పరిశీలించారు. పాఠశాలల్లో విటమిన్ గార్డెన్లను ఆకర్షణీయంగా ఏర్పాటుచేయడమే కాకుండా అక్కడ పండిస్తున్న కూరగాయలు(Vegetables), ఆకు కూరల్లో ఏ విటమిన్లు, మినరల్స్ (Minerals) ఉన్నాయో విద్యార్థులకు తెలిసేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు.
తినే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి ఏ విటమిన్లు అందుతాయో చెప్పడమే విటమిన్ గార్డెన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి పాఠశాలలో స్నేహిత బోర్డులు, విద్యార్థుల కెరీర్ చార్ట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, విద్యా శాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి ఉన్నారు.
