Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిLegal Awareness | గ్రామాలలోన్యాయ సహాయం పై దృష్టి పెట్టండి

Legal Awareness | గ్రామాలలోన్యాయ సహాయం పై దృష్టి పెట్టండి

రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి G అనూష ని మర్యాద పూర్వకంగా కలిసిన సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం.

మారు మూల గ్రామాలలో న్యాయ సహాయం పై దృష్టి పెట్టండి.
సురక్ష సేవా సంఘం తో…DLS కార్యదర్శి శ్రీమతి G అనూష.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా కోర్ట్ ల సముదాయం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సమాజ సేవలో ఎంతో పేరు గాంచిన సురక్ష సేవా సంఘం తెలంగాణ. నూతనంగా నియమితులైన రంగారెడ్డి జిల్లా DLS కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి G అనూష ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలలో న్యాయ చైతన్యం తీసుకు రావాలని ఆమె మాట్లాడటం జరిగింది.. ఈ సందర్భంగా న్యాయమూర్తి G అనూష మాట్లాడుతూ పేద ప్రజల ఔన్నత్యానికి సురక్ష లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్, న్యాయ సలహా దారులు శ్రీ బుద్దె కమలాకర్, కార్య వర్గ సబ్యులు నరసింహ చారి, శ్రీమతి నాగమణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News