Tuesday, March 3, 2026
Homeఅంతర్జాతీయంVietnam | వియత్నాంలో వరదలు.. 16 మంది మృతి..

Vietnam | వియత్నాంలో వరదలు.. 16 మంది మృతి..

అక్టోబర్ చివరి వారం నుంచి సౌత్ సెంట్రల్(South Central) వియత్నాంలో వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికి 16 మంది చనిపోయినట్లు (Died) అధికారులు తెలిపారు. సహాయక చర్యలు (Assistive Measures) కొనసాగుతున్నాయి. సిబ్బంది పడవల్లో వెళ్లి వరద బాధితులను (Victims) రక్షిస్తున్నారు. వందలాది కార్లు (Cars), 43 వేల ఇళ్లు (Houses) నీట మునిగాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం (Tourist Place) న్హా ట్రాంగ్‌ను వరద ముంచెత్తింది. కొండచరియలు (Landslides) విరిగి పడటంతో ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే పలు రైళ్లు రద్దయ్యాయి (Trains Cancel). వరదల్లో చిక్కుకుపోయినవాళ్లను కాపాడేందుకు రక్షణ శాఖ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News