ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(ప్రస్తుతం కామారెడ్డి జిల్లా)లోని నిజాంసాగర్(Nizam Sagar)లోకి వరద ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి 4048 క్యూసెక్‌ల నీరు వస్తోంది. దీంతో జలాశయంలోని ప్రధాన వరద గేటు ఎత్తి దిగువ ఉన్న మంజీరా (Manjira) నదిలోకి నీటిని వదులుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ (Irrigation) ఏఈఈ సాకేత్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు. ఇందులో 17.802 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. నిజాం సాగర్ ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. కింది ప్రాంతాలకు నీటిని విడుదల చేయటంతో మత్స్యకారులు, రైతులు, పశువుల కాపరులు అటువైపు వెళ్లొద్దని సూచించారు.
- Advertisment -
