- 1500 మంది సిబ్బందితో రెండవ విడత ఎన్నికలకు ఐదు అంచెల పోలీస్ భద్రత.
- విజయోత్సవ ర్యాలీలకు బాణాసంచాకు, డీజే లకు అనుమతి లేదు.
- జిల్లా ఎస్పీ నరసింహ.
సూర్యాపేట జిల్లాలో రెండవ విడతలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న చివ్వెంల, పెనపహడ్, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, కోదాడ, చిలుకూరు అత్యంత నిఘా ఉంచాం అని ఎస్పి కొత్తపల్లి నరసింహ తెలిపారు. ఓటర్లు కాని వారు ఈ ఎనిమిది మండలాల్లో ఉండకూడదని కోరారు. అపోహలు సృష్టించకుండా, తప్పుడు సమాచారం ప్రచారం చేయకుండా ఉండాలి, సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ నిశిత పరిశీలన ఉన్నది, ఎవరైనా ఎన్నికల విధానానికి అటంకం కలిగించేలా ప్రవర్తించిన తప్పుడు సమాచారం ప్రచారం చేసిన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.1500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలకు ఐదు అంచల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు
పోలింగ్ బూతుల వద్ద, పోలింగ్ లొకేషన్ ల వద్ద, 100 మీటర్ల పరిధి, 200 మీటర్ల పరిధిలో, స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఎన్నికల నియమావళి అమలు టీమ్స్, రూట్ మొబైల్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు అన్నారు. గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఆన్లైన్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా ఈ కేంద్రాలలో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. సీసీ కెమెరాలు, కెమెరాలతో ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది అన్నారు.బందోబస్తు కు ఎస్పీలు – 2, డిఎస్పీ లు – 8, ఇన్స్పెక్టర్ లు – 15 , సబ్ ఇన్స్పెక్టర్ లు – 50, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డు కలిపి 1500 మంది.

- ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో, ప్రత్యేక బలగాలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ విధుల్లో అంటారు.
ఓటర్లకు, అభ్యర్థులకు సూచనలు :
- మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదా, లేదా నిర్ధారించుకోండి.
- పోలింగ్ సెంటర్ కు సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంట ప్రేరేపిత వస్తువు తేవోద్దు, సెల్ఫీలు దిగవద్దు.
- మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే చూసుకోండి.
- పోలింగ్ రోజున ఎన్నికల సంఘం చూపిని 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురండి.
- తెలియని వ్యక్తులకు ఓటర్ ఐడి లేదా ఓటర్ స్లిప్ ఇవ్వొద్దు.
- రహస్య పద్ధతిలో ఓటు వెయ్యాలి, ఫలానా గుర్తుకు ఓటు వేశానని బయటకు చెప్పవద్దు.
- కార్యకర్తలు, అభ్యర్థులు ఓటరు స్లిప్స్ పంచవద్దు.
- పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలబడి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. సిబ్బంది సూచనలు పాటించాలి.
- పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయవద్దు.
- పోలింగ్ కేంద్రం ఆవరణంలో బయట 100 మీటర్ల దూరం లోపల ఎవరైనా ప్రచారం చేసిన, బెదిరించిన, మభ్యపెట్టిన పోలీసు సిబ్బందికి తెలియజేయండి.
- వికలాంగులను, వృద్ధులను, మహిళలను గౌరవించండి. వారు త్వరగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించండి.
- వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. దీనికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయి.
- కౌంటర్ కేంద్రాల వద్ద కుమిగోడడం చట్టరీత్యా అనుమతి లేదు అలాంటి వారిపై చర్యలు తీసుకోబడతాయి.
- కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి.
- సౌండ్ సిస్టం, బాణాసంచా వినియోగించడానికి అనుమతి లేదు.
