ఈ ఏడాది ధీరజ్‌కోట్ల పురస్కారాల్లో ‘వశీకరణం’కి (Vasheekaranam) ప్రథమ బహుమతి(రూ.10 వేలు) లభించింది. ఈ కథా సంపుటి(Story Collection)ని ఎంబీఎస్ ప్రసాద్(Mbs Prasad) రాశారు. ద్వితీయ బహుమతుల(రూ.1,116)కి నల్లరేగడి నేలల్లో(పాలగిరి విశ్వప్రసాద్), పంకజం పదనిసలు(స్వరాజ్య పద్మజ కుందుర్తి), గారడీవాడు(మునిసురేష్ పిళ్లె), ఆలీబాబా అనేక దొంగలు(దేశరాజు), మౌనం ఎరుపు (బి.మురళీధర్), వెల్చేరు చంద్రశేఖర్ కథలు(వెల్చేరు చంద్రశేఖర్), నాతి చరామి(గొర్తి వాణి శ్రీనివాస్) కథా సంపుటాలు ఎంపికయ్యాయి.
విశిష్ట పురస్కారానికి (రూ.3 వేలు) టిఎస్ఏ కృష్ణమూర్తి, యువ రచయిత పురస్కారానికి (రూ.1,116) దొండపాటి కృష్ణ(రాతి గుండెల్లో నీళ్లు), బాల సాహిత్య పురస్కారానికి.. వాసుకి నూచెర్ల(తింగరి కథలు), ఆత్మీయ పురస్కారానికి కేతు పద్మమ్మ(అమ్మ మనసు) ఎంపికయ్యారు. ఈ పోటీల కోసం తమ కథా సంపుటాలను పంపినవారిని సభా ముఖంగా గౌరవించడంతోపాటు ఆ పుస్తకాల ధరలను రచయితల(Writers)కు చెల్లించడం జరుగుతుంది.
పోటీకి వచ్చిన అన్ని కథా సంపుటాలపై సమీక్షలతో పుస్తకం (Review Book) వెలువడుతుందని పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి(పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల ఛారిటబుల్ ట్రస్ట్, అద్దంకి) తెలిపారు. ప్రముఖ సాహితీ విశ్లేషకుడు ఎన్.రవిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పురస్కారాల ఎంపికలు జరిగాయి.
