ఏపీలో తొలి లైట్ హౌజ్ మ్యూజియం(Light House Museum) వైజాగ్‌లో రానుందని కేంద్ర మంత్రి(Union Minister) సర్బానంద సోనోవాల్(Sarbananda Sonowal) ప్రకటించారు. సముద్ర విద్యను ప్రోత్సహించడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా విశాఖపట్నంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. లైట్‌హౌజ్ పర్యాటకం గణనీయమైన వృద్ధిని సాధించిందని, 75 లైట్‌హౌస్‌లను పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసిన తర్వాత సందర్శకుల సంఖ్య 2014లో 4 లక్షల నుంచి ప్రస్తుతం దాదాపు 20 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఈ విజయం ఆధారంగా దేశవ్యాప్తంగా మరో 25 లైట్‌హౌజ్‌లను అభివృద్ధి చేయాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు వెల్లడించారు.. 3వ ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్(Indian Lighthouse Festival) ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలను వివరించారు. మన దేశం 2027 జనవరిలో తొలిసారిగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెరైన్ ఎయిడ్స్ టు నావిగేషన్ అండ్ లైట్‌హౌస్ అథారిటీస్(IALA) జనరల్ అసెంబ్లీని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 42 సభ్య దేశాల భాగస్వామ్యంతో ఇది జరుగుతుందని, ప్రపంచ సముద్ర నావిగేషన్‌లో ఇండియా నాయకత్వం పెరుగుతుండటాన్ని ఇది ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు.
Vizag | ఏపీలో తొలి లైట్‌హౌజ్ మ్యూజియం
- Advertisement -
RELATED ARTICLES
