హైదరాబాద్ వేదికగా భారతదేశంలో తొలిసారిగా ఎఫ్‌ఐపీ సిల్వర్ పాడెల్ టోర్నమెంట్ జరగనుంది. ఈనెల 7 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లోని కేపీజీబీఏలో నిర్వహిస్తారు. భారతదేశ క్రీడా చరిత్రలో కీలకమైన ఘట్టంగా, ఇండియన్ పాడెల్ ఫెడరేషన్(ఐపీఎఫ్) మొట్టమొదటి ఎఫ్‌ఐపీ సిల్వర్ హైదరాబాద్ 2025 టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. శుక్రవారం దీని గురించి ప్రకటించారు. ఈ అంతర్జాతీయ పాడెల్ ఫెడరేషన్ టూర్ ఈవెంట్‌లో 15,00,000 లక్షల రూపాయలు రికార్డు స్థాయి ప్రైజ్ పూల్ ఉంది. ఈ టోర్నమెంట్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ప్రపంచ స్థాయి అంతర్జాతీయ స్టార్లు, అలాగే ప్రతిభావంతులు పాల్గొంటారు. ఈ చారిత్రక ఈవెంట్ భారతదేశంలో పాడెల్ క్రీడ రూపురేఖలను పూర్తిగా మార్చబోతోంది.
Tournament | హైదరాబాద్ వేదికగా ఎఫ్‌ఐపీ సిల్వర్ పాడెల్ టోర్నమెంట్
RELATED ARTICLES
- Advertisment -