Wednesday, April 8, 2026
Homeఆదిలాబాద్Support | నర్సయ్య కుటుంబానికి జిల్లా అధికారుల ఆర్థిక సహాయం.

Support | నర్సయ్య కుటుంబానికి జిల్లా అధికారుల ఆర్థిక సహాయం.

జిల్లాలో డిసిఓ గా పని చేస్తూ, రోడ్డు ప్రమాదంలో మరణించిన నర్సయ్య కుటుంబానికి జిల్లా అధికారులు మంగళవారం ఆర్థిక సహాయం చేశారు. కలెక్టర్ ఛాంబర్ లో, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతులమీదుగా చెక్కులు, జిల్లా అధికారుల సంఘం తరుపున నగదు అందించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

- Advertisement -

చెక్కులను అందించినవారిలో సిపిఓ జీవరత్నం, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎస్టీఓ సరోజ, డిపిఓ శ్రీనివాస్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, ఎస్సీ, మైనారిటీ, బిసి సంక్షేమ శాఖల అధికారులు దయానంద్, మోహన్ సింగ్, శ్రీనివాస్, డిసిఎస్ఓ రాజేందర్, డిఎం ఇండస్ట్రీస్ నరసింహా రెడ్డి, ఇతర అధికారుల ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News