Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆరోగ్యంఅప్పుడప్పుడూ ఉపవాసం మంచిదే

అప్పుడప్పుడూ ఉపవాసం మంచిదే

ఆ సమయంలో ఏమేం తాగాలంటే..

అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గటానికి కూడా పనికొస్తుంది. అయితే ఆ సమయంలో హెల్దీ డ్రింక్స్ తాగాలి. ఇందులో ముఖ్యమైంది నిమ్మకాయ నీరు. ఈ నీటిలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యునిటీని ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణానికీ సాయపడుతుంది. మోషన్‌ని ఈజీ చేస్తుంది. బాడీలో నీరు ఉండటంలో, వ్యర్థాలు బయటికి పోవటంలో ఉపకరిస్తుంది. ఉపవాసం ఉన్నవాళ్లకు బ్లాక్ కాఫీ కూడా బాగానే పనిచేస్తుంది. ఇందులోని కెఫిన్ కంటెంట్.. నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. కొవ్వును కరిగించడానికి సిగ్నల్స్ పంపుతుంది. జీవక్రియనూ మెరుగుపరుస్తుంది.

ఉపవాస ప్రయోజనాలను పెంచుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగినా ప్రయోజనకరమే. ఇందులోనూ కెఫిన్ ఉంటుంది. కాకపోతే తక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతోపాటు కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ టీ వల్ల కడుపులో మంట తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు హెర్బల్ టీ సైతం బెటర్ ఛాయిసే అని చెప్పొచ్చు. పిప్పరమెంట్, అల్లం తదితర హెర్బల్ టీలు నేచురల్‌గా కేలరీలు లేనివి. బరువు, కొవ్వు తగ్గడానికి ఉపయోగపడతాయి. అజీర్ణం, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు మంచి నీరు తాగాలి. నీరు తాగితే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఆకలిని అదుపు చేస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News